Rats problem: ఇలా  చేస్తే ఎలుకలు పరార్​

మీ ఇంట్లో ఎలుకలు తిష్ఠ వేశాయా.. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వాటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మార్కెట్​లో అనేక ర్యాట్​ కిల్లర్లు అందుబాటులో ఉన్నప్పటికీ  ఎలుకల్ని చంపాలంటే మనకు మనసు రాదు. అలాగనీ ఇంట్లో వాటిని ఉంచుకోలేం. కాబట్టి వాటంతటా అవే ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తే బెటర్​.

ఎలుకలు ఇంట్లో ఉంటే కొన్ని వస్తువులను చిందరవందర చేయడమే కాకుండా ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తాయి. ఎలుకలు కొరికిన ఆహారాన్ని మనం తీసుకుంటే చాలా డేంజర్​. కాబట్టి వాటిని ఇంట్లో లేకుండా చూసుకోవాలి. మార్కెట్​లో దొరికే స్ప్రేలతో ఎలుకల్ని తరిమికొట్టే చాన్స్​ ఉన్నప్పటికీ, ఆ స్ప్రేల నుంచి వెలువడే కెమికల్స్ మనకు హాని చేస్తాయి. కాబట్టి ప్రత్యామ్నాయ చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.

Rats problem: ఇలా  చేస్తే ఎలుకలు పరార్​

http://prastanam.com/eagle-inspirational-story/ఎలుకలకు పుదీనా వాసన పడదు.  కాబట్టి దాని సాయంతో వాటిని తరిమికొట్టొచ్చు.  పుదీనా తైలం(peppermint oil)లో చిన్న చిన్న దూది ముద్దలను ముంచి తీయాలి. వాటిని ఇంట్లో అక్కడక్కడా పెట్టాలి. దీంతో ఎలుకలకు చెక్​ పెట్టవచ్చు. లవంగాలు (cloves) ఎలుకలకు శత్రువు వంటివి. ఎలుకలు వచ్చిపోయే మార్గాల దగ్గర లవంగాలను ఉంచితే ఎలుకలు ఇంట్లోకి రావు. కారంతోనూ పరిష్కార మార్గం ఉంది. ఓ పాత క్లాత్​పై కారం చల్లి ఆ గుడ్డను ఓ సంచిలో వేసి ఎలుకల రంధ్రాల దగ్గర పెట్టాలి. ఎలుకలే కాకుండా చీమలు, బొద్దింకలు, పురుగులకు కూడా కారం అంటే పడదు. తినే సోడా (baking soda)ను ఇంట్లోని ఎలుకలు తిరిగే ప్రాంతాలన్నింటిలో చల్లినా ఎలుకల సమస్యను పరిష్కరించవచ్చు. ఈ పద్ధతుల వల్ల ఎలుకలు చనిపోవు. కానీ మన ఇంట్లోకి మాత్రం అస్సలు రావు. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో ఎలుకల సమస్య ఉంటే ఈ చిట్కాలు ఓసారి ట్రై చేయండి.

ఇవీ చదవండి:

http://prastanam.com/success-story-jilla-sai/

http://prastanam.com/women-life-chittila-manemma/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *