Gangavva : గంగవ్వకు ప్రిన్స్​ భరోసా

 

Gangavva : గంగవ్వకు ప్రిన్స్​ భరోసా

Gangavva : గంగవ్వకు ప్రిన్స్​ భరోసా

లంబాడిపల్లి గంగవ్వ… పరిచయం అక్కర్లేని పేరు. మై విలేజ్​ షో యూట్యూబ్​ చానల్​ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్​ సంపాదించుకుంది ఈ అవ్వ. జగిత్యాల జిల్లాలోని మారుమూల పల్లెటూరు లంబాడిపల్లికి చెందిన గంగవ్వ తెరపై కనిపించిందంటే చాలు నవ్వులు పూయాల్సిందే. అందరినీ నవ్విస్తూ అలరిస్తున్న ఈ అవ్వ జీవితంలో ఎన్నో కష్టాలు కూడా ఉన్నాయి. అనేక ఇంటర్వ్యూల్లో తాను పడ్డ కష్టాలను చెప్పుకుంది. పలు సినిమాల్లో, టీవీ షోల్లో మెప్పించిన గంగవ్వకు ఓ కోరిక మాత్రం తీరలేదు. గుడిసెలో కాలం వెల్లదీస్తున్న ఆమెకు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నట్లు అనేక వేదికల ద్వారా చెప్పుకొచ్చింది. ఇప్పటికే బిగ్​బాస్​ హోస్ట్​ నాగార్జున ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వగా.. తాజాగా సినీ హీరో మహేశ్​బాబు కూడా తన వంతు సాయం చేస్తానని ముందుకొచ్చినట్లు తెలిసింది.. (Gangavva )

Gangavva : గంగవ్వకు ప్రిన్స్​ భరోసా

ఇంటి కోసమే బిగ్​బాస్​కు..

అరవై ఏళ్ల వయసులో బిగ్​బాస్​ కంటెస్టెంట్​గా ఎన్నికై రికార్డు సృష్టించింది గంగవ్వ. బిగ్​బాస్​లో హౌజ్​లో అడుగుపెట్టడమే కాకుండా తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. పంచ్​ డైలాగులతో తన మార్క్​ చూపించింది. టాస్కుల్లోనూ హుషారుగా పాల్గొంటూ ఔరా అనిపించింది. కానీ మట్టిలో పెరిగిన ఆ అవ్వకు బిగ్​బాస్​ హౌజ్​ వాతావరణం పడలేదు. ఊరుపై ఉన్న బెంగతో ఆరోగ్యం క్షీణించింది. తనను ఊరుకు పంపిచాలంటూ బిగ్​బాస్​కు మొర పెట్టుకుంది. కేవలం ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతోనే తాను బిగ్​బాస్​కు వచ్చానని, బాగా ఆడుదామని ఉన్నా.. ఆరోగ్యం సహకరించడం లేదని విలపించింది. దయచేసి బయటికి పంపించాలంటూ చేతులెత్తి వేడుకుంది. డాక్టర్లతో ట్రీట్​మెంట్​ ఇప్పించి కొన్ని రోజులు ఇంట్లో ఉండేలా చేసినప్పటికీ ఆమె పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చేసేదేమి లేక బిగ్​బాస్​ యాజమాన్యం ఆమెను బయటికి పంపించేసింది.

Gangavva : గంగవ్వకు ప్రిన్స్​ భరోసా

అప్పుడు నాగార్జున.. ఇప్పుడు మహేశ్​బాబు​

హౌజ్​ నుంచి బయటికి వచ్చిన గంగవ్వ ఇల్లు కట్టుకోవాలనే కోరికను మరోసారి గుర్తు చేసింది. దీంతో ఏం బాధపడొద్దని, తాను అండగా ఉంటానని బిగ్​బాస్​ హోస్ట్​ నాగార్జున హామీ ఇచ్చారు. గంగవ్వ ఇంటి విషయం తెలిసి చలించిపోయిన సినీ హీరో మహేశ్​బాబు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. గతంలో మహర్షి సినిమా షూటింగ్​ సమయంలో మహేశ్​బాబుని గంగవ్వ కలిశారు. తాను నటించబోయే ఓ సినిమాలో గంగవ్వకు మంచి రోల్​ ఇవ్వాలని దర్శకుడికి సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. మొత్తానికి సినీ స్టార్ల అండతో గంగవ్వ చిరకాల వాంఛ త్వరలోనే తీరాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

2 thoughts on “Gangavva : గంగవ్వకు ప్రిన్స్​ భరోసా

  1. Thanks for your thoughts. One thing I’ve got noticed is the fact banks in addition to financial institutions understand the spending behaviors of consumers and as well understand that the majority of people max outside their cards around the breaks. They smartly take advantage of that fact and then start flooding ones inbox in addition to snail-mail box having hundreds of no interest APR credit cards offers shortly after the holiday season closes. Knowing that for anyone who is like 98% in the American general public, you’ll soar at the one opportunity to consolidate consumer credit card debt and switch balances towards 0 interest rate credit cards. mmmlkno https://headachemedi.com – new headache meds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *