భారత్‌పై నిందలు మానండి, : పాక్‌కు చైనా ఝలక్‌

0
353

బీజింగ్‌ : అంతర్జాతీయంగా జరిగే ప్రతి వ్యవహరంలోనూ భారత్‌పై నిందలు వేసే బుద్ధిని మానుకోవాలని పాకిస్తాన్‌కు చైనా స్పష్టం చేసింది. ముఖ్యంగా 500 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై భారత్‌ గూఢచర్యం చేస్తోందన్న పాకిస్తాన్‌ వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. సీపీఈసీ ప్రాజెక్టును గందరగోళ పరిచేలా వివాదాస్పద ప్రాంతాల్లో భారత్‌ అరాచకత్వాన్ని పెంపొందిస్తోందని పాకిస్తాన్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌ జనరల్‌ జుబిర్‌ మహమ్మద్‌ హయత్‌ నవంబర్‌ 14న ప్రకటించారు. భారత నిఘా సంస్థ అయిన రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ (రా) ఇందుకోసం ప్రత్యేకంగా 500 మిలియన్లతో ఒక జట్టును తయారు చేసిందని ఆయన పేర్కొన్నారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవావాదాన్ని భారత్‌ పెంపొందిస్తోందని ఆయన చెప్పారు.

సీపీఈసీ ప్రాజెక్టు గురించి భారత్‌పై పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిదికాదని చైనా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఆక్రమిత్‌ కశ్మీర్‌ భూభాగంలో సీపీఈసీ ప్రాజెక్ట్‌ నిర్మించిడంపై ఇప్పటికే భారత్‌ అభ్యంతరాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వాటా