వింత పక్షుల ఆచూకీ దొరికింది

0
984

విశాఖ: విశాఖకు కొన్ని వింత పక్షులు వచ్చాయని, అవి గ్రహాంతరవాసుల రూపురేఖలతో ఉన్నాయని వాట్సాప్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుండగా.. వాటి ఆచూకీ ఎట్టకేలకు బయటపడింది. పాతనగరంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పక్కనే గల ఒడిశా స్టీవ్‌డోర్స్‌ లిమిటెడ్‌ అనే షిప్పింగ్‌ సంస్థ బాత్‌రూమ్‌ గదిలో అవి ఉన్నట్టు గుర్తించారు. గుడ్లగూబ మాదిరి ఉన్న ఆ పక్షులకు సోషల్‌ మీడియా అభిమానులు తమదైన శైలిలో పాటలు, మాటలను జత చేస్తూ.. ఏలియన్స్‌, ఏలియన్స్‌ పక్షులు అని రకరకాల పేర్లు పెడుతూ ప్రచారం చేఉశారు. ఒడిశా స్టీవ్‌డోర్స్‌ లిమిటెడ్‌ భవనంలో గల మూడో అంతస్తులో ఓ బాత్‌రూమ్‌లో ఉన్న మూడు పక్షులను చూసిన సంస్థ జనరల్‌ మేనేజర్‌ జేకే నాయక్‌ మాట్లాడుతూ 15 రోజుల క్రితం కార్యాలయ గదిలో వింత శబ్ధాలతో పాటుగా తీవ్ర దుర్వాసన వస్తుండడంతో అన్నిచోట్ల వెదికామన్నారు. బాత్‌రూమ్‌లోని పీఓపీ సీలింగ్‌పై చూడగా మూడు వింత ఆకృతిలో ఉన్న పక్షులు కనిపించాయన్నారు. మొదట్లో అందరూ వీటిని గుడ్లగూబల్లా ఉన్నాయని చెప్పినా వాటికంటే చాలా ఎత్తుగా పొడవు కాళ్లతో వింత శబ్ధాలు చేస్తున్నాయన్నారు. తల్లి పక్షి బాత్‌రూమ్‌కు ఉన్న రంధం ద్వారా బయటకు వెళ్లి ఏదో ఆహారం తీసుకొస్తుందని, మేం పెట్టిన పండ్లు, కాయగూరలు ఏమి తినడం లేదని ఆయన చెప్పారు.

వాటా