Eagle inspirational story: బతికితే డేగలా బతకాలి…

ఈగల్​.. మనకు నేర్పే పాఠమేంది..

దాని ఆకారం భయంకరం.. కానీ దాని జీవితం ఆదర్శప్రాయం.. కసి, పట్టుదలకు అది నిలువెత్తు సాక్ష్యం. చిన్నచిన్న సమస్యలకే జీవితం ఒడిసిపోయినట్టు ఫీలయ్యే ఎంతోమందికి ఈగల్​ లైఫ్​ స్టైల్​ ఓ ఇన్స్​పిరేషన్​. డేగ నుంచి మనుషులు నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ దాని గొప్పతనం ఏంటి.. దాని నుంచి స్ఫూర్తి పొందే అంశాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం..

eagle

ఆకాశంలో స్వేచ్ఛగా తిరుగుతూ హుందాగా కనిపించే డేగ(Eagle) జీవితమంతా రాజులా బతుకుంది. సాధారణంగా ఈగల్​ 70 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే 40 ఏండ్లు వచ్చేసరికి వృద్ధాప్యంలోకి చేరి డేగకు కొత్త సమస్యలు వస్తాయి. శక్తిసామర్థ్యాలను తీవ్రంగా కోల్పోయి బలహీనంగా మారుతుంది. దాని ముక్కు, రెక్కలు, గోర్లు పటుత్వాన్ని కోల్పోతాయి. దీంతో ఎగరడానికి, శత్రువులపై దాడి చేయడానికి అవకాశాన్ని కోల్పోతుంది. డేగ ముక్కు, నోరు షార్ప్​గా ఉండడమే దానికి ప్లస్​ పాయింట్​. ముక్కు వంకర పోవడంతో ఆహారాన్ని తీసుకోలేదు. రెక్కలు నిస్సారంగా మారడంతో గాల్లోకి ఎగరడమూ కష్టమే. ఇలాంటి నిస్సహాయ స్థితిలోనూ డేగ కుంగిపోదు. రణమా.. శరణమా అంటూ ముందుకు వెళ్తుంది. పోయిన పటుత్వాన్ని మళ్లీ పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. తిరిగి పూర్వవైభవాన్ని తెచ్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది.

eagle

కొత్త రెక్కలు తొడిగి..

పరిస్థితులకు అనుగుణంగా మారడం డేగకు వెన్నతో పెట్టిన విద్య. 40 ఏళ్లకు వచ్చేసరికి ముక్కు పటుత్వాన్ని కోల్పోయిన డేగ అది ఎత్తైన పర్వతానికి వెళ్లి తన ముక్కును పర్వతానికి వేసి కొట్టుకుంటుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల నోరు, ముక్కు భాగాలు విరిగిపోతాయి. ఆ తరువాత కొన్ని రోజులకు కొత్త ముక్కు, నోటి భాగాలు వస్తాయి. కొత్తగా వచ్చిన ముక్కుతో డేగ తన పాత గోళ్లను పెకిలించివేస్తుంది. కొన్ని రోజుల తరువాత కొత్త గోళ్లు వచ్చాక వాటితో తన రెక్కలకు ఉన్న ఈకలను పీకేస్తుంది.

ఇది చాలా నొప్పితో కూడుతున్న పని. అయినా డేగ వెనక్కి తగ్గదు. ఇప్పుడు డేగ పదునైన ముక్కు, నోరు, శక్తివంతమైన గోర్లు, రెక్కలను పొందింది. ఈగల్​లో ఈ మార్పులన్నీ జరగడానికి ఐదు నెలల టైం పడుతుంది. ఐదు నెలలు ఆపసోపాలు పడి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇది మొండితనానికి, పట్టుదలకు నిదర్శనం. సాధించాలనే తపన ఉంటే ఏదైనా చేయొచ్చని డేగ నుంచి మనం నేర్చుకోవచ్చు.

ధైర్యంలో దీనికిదే సాటి..
డేగ ప్రతికూల పరిస్థితులను చూసి అస్సలు భయపడదు. తనకు అనుకూల పరిస్థితులు వచ్చే వరకు విశ్రమించదు. తనను తాను మార్చుకొని నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈగల్​లో ప్రత్యేకతల విషయానికొస్తే.. దాని కంటిచూపు చాలా పవర్​ఫుల్​. అది 50 మైళ్ల దూరంలో ఎగురుతున్న మరో పక్షిని చూడగలదు. దీని నుంచి మనం దూరదుష్టితో ఆలోచించడం నేర్చుకోవచ్చు. డేగకు భయం అనేది ఉండదు. శత్రువు ఎంత పెద్దదైనా అటాక్​ చేయడమే దానికి తెలుసు. దీని కన్న పెద్ద ఆకారంతో ఉన్న జంతువులను సైతం కాలి గోళ్లతో మట్టి కరిపించగలదు. శత్రువులకు ఎన్నడూ వెన్నుచూపని స్వభావం డేగది. (Eagle inspiration story)

http://prastanam.com/common-man-success-story/

డేగ రూటే.. సపరేటు..
క్లిష్ట పరిస్థితులకు డేగ ఎన్నడూ తలొగ్గదు. తుఫాను వచ్చినప్పుడు పక్షులన్నీ ఏదైనా చెట్టు కిందకు గానీ, కొండ గుహలు, పైకప్పు ఉన్న ప్రదేశాల్లో గానీ తలదాచుకుంటాయి. కానీ డేగ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తుంది. తుఫానుకు కారణమైన మేఘాల పైకి వెళ్లి గాలి వానకు అందనంతా ఎత్తులో సేద తీరుతుంది. డేగలు 10 వేల అడుగుల ఎత్తుకు సునాయసంగా ఎగురగలవు. అంతేగాకుండా అతి వేగంగా భూమి పైకి చేరుకోగలవు. డేగ ఫుడ్​ కోసం ఇతర పక్షులతో గొడవ పడదు. పైన ఎగురుతూ ఒక టార్గెట్​ పెట్టుకొని సూటిగా ఎటాక్​ చేస్తుంది. సమయం తీసుకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్​ మిస్​ కానివ్వదు. తెలివిగా పరిస్థితులను అంచనా వేస్తుంది. మరో విషయమేమిటంటే డేగలు ఎన్నడూ చనిపోయిన జంతువుల మాంసాన్ని తినవు. తాను వెంటాడి చంపిన ఫ్రెష్​ మాంసాన్ని మాత్రమే ఆరగిస్తాయి. (Eagle inspiration story)

చిన్నప్పటి నుంచే ట్రైనింగ్​..

డేగలు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలు అలవాటు చేస్తాయి. అన్ని విద్యలను దగ్గరుండి నేర్పుతాయి. డేగ యుక్త వయస్సు పిల్లలను తనపై అతి ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి తనపై కూర్చోపెట్టుకుని ఎగురుతూ ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటుంది. దీంతో పిల్ల డేగ తన రెక్కలకు పనిచెప్తుంది. తన శక్తినంతా బయటపెట్టే అవకాశం తల్లి కలిపిస్తుంది అన్నమాట. మొత్తానికి పసిప్రాయం నుంచే డేగ యుద్ధనీతిని ప్రదర్శిస్తూ.. చచ్చే వరకు తిరుగులేని జీవిలా బతుకు పయనం కొనసాగిస్తుంది. అందుకే బతికితే డేగలా బతకాలి.

Written by
Bommagani Srikanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *